Header Banner

ఏపీలో భూ ప్రకంపనలు! భయంతో ప్రజలు గజగజ... రాత్రికి రాత్రే !

  Tue May 06, 2025 13:59        Others

ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయపడిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలో ఇవాళ(మంగళవారం) భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొదిలి, దర్శి, ముండ్లమూరు మండలాల్లో రెండు సెకళ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

ఈ ప్రాంతాల్లో గతంలోనూ భూ ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. భూకంపాలపై గతంలోనూ ఈ ప్రాంతాల్లో అధికారులు పరిశోధనలు చేశారు. భూగర్భంలో చిన్న చిన్న కదలికలు వచ్చినప్పుడు ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవి భారీ భూకంపాలకు సంకేతాలుగా మారుతాయా లేదా సాధారణంగా వచ్చే ప్రకంపనలేనా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

ప్రజల భద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజలు భయపడవద్దని, ఎలాంటి అపోహాలకు లోను కావద్దని అధికారులు చెబుతున్నారు. భూప్రకంపనలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. భూకంపాల వేగం, తీవ్రత వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ జరగాలని ప్రజలు అంటున్నారు.

 

ఇది కూడా చదవండిటీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #EarthquakeShock #AndhraTremors #PrakasamQuake #GroundShaking #PanicInAP #QuakeAlert